
*******************************
అమవాస్యలో వెన్నెల పంచినది
ఎడారిలో సైతం ప్రేమ వర్షం కురిపించినది
తాను కరిగిపోతూ మనలో వెలుగును నింపినది
తనను తాను మరిచి మనమే తానుగా బ్రతికినది
పరమ పావనమై స్వర్గాన్ని మించినది అమ్మ ఒడి
అయినా బిడ్డ ఆమెను మరిచినది
కానీ ఎన్నటికి ఎండనిది ఆ అమ్మ... మమతల జీవనది.!!!
***********************************
అమ్మ రెండక్షరాల పదం కాదు...
అనంత జన్మల పుణ్యఫలం.......
అమ్మ ఒడి స్వర్గాన్ని మించిన స్థలం ....
కష్టంలో అమ్మ ఇచ్చే ఓదార్పు కొండంత బలం
అమ్మ ప్రేమ ముందు ఏదీ కాదు స్వచ్ఛం
అమ్మను అర్ధం చేసుకోలేకపోతే అది నీ దౌర్భాగ్యం ....
త్యాగం అమ్మ జీవితంలో భాగం
ఆ అమ్మే లేకపోతే లేదీ జగం ..
ఇది మాత్రం నిజం ...నిజం ....
*********************************ఆప్యాయతల కోవెలలో అనురాగ దేవత అమ్మ
ఆ అమ్మకు మన ఆనందాలే .... అభిషేకం
మన సంతోషాలే ... శ్లోకాలు
మన ఆరోగ్యమే ..హారతి
మన విజయమే.... నైవేద్యం
క్ర య విక్ర యాలకు తావులేనిది అమ్మ ప్రేమ
త్యాగానికి మారుపేరే ...అమ్మ ప్రేమ
ఆ ప్రేమను ఆస్వాదించగల్గడం ఒక అద్భుత అనుభవం
**********************************
ఉదయించే అరుణుడి కన్నా.... అధికంగా ప్రకాశించేది
వేణుమాధవుని వేణువు నుండి ...వెలువడే రాగం కన్నా విలక్షణమైనది
సుస్వరాల సరాగం కన్నా ....సొంపైనది
పరిమళించే పుష్పాల కన్నా.... సున్నితమైనది
సుగంధాల సువాసన కన్నా .....సుమధుర మై నది
ప్రార్థించే దేవుని కన్నా పూజ్యనీయ మై నది
అన్నివేళలా నీ అభ్యున్నతిని అభిలషించేది
అవనిలో అందరికీ అందనిది అమ్మప్రే మ అదే మన విజయానికి చిరునామా
అట్టి అమ్మను ఎన్నటికీ విడువకుమా.
***********************************అమ్మా అని నువు పిలువక ముందే నీ అవసరాన్ని అర్థం చేసుకునేది అమ్మ
ఆకలి అని నువు అడుగక ముందే ...నీ ఆకలి తీర్చేది అమ్మ
నీ కష్టాలను తాను తీసుకుని తన సుఖాలను ...నీకు పంచేది అమ్మ
జీవితంలో నీకు అన్నీ ఇచ్చిన కాదు నీకు జీవితాన్నే ఇచ్చిన
అమ్మకు అవసరమై న సమయంలో నీవు అండగా వుండలేవా?
ఆ అమ్మ కోసం ఏమీ చేయలేవా?
ఇది నీ మనసులో కూడా వున్న ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం వెతికే తరుణంలో
నీ నయనం ఒక్క అశ్రువైనా రాల్చక మానదు.
**********************************కష్టాలనే సూర్యుడు కలిగించే దుఃఖమనే ఎండలో నీవు వున్నపుడు ,
అమ్మ అనే మేఘం ఓదార్పు అనే చినుకుల రూపంలో నిన్ను చేరినపుడు,
నీవు పొందు ఆనందం ,అవధుల్లేని ఆకాశంలో విరిసిన అందాల హరివిల్లు వంటిది.
అది అమ్మను కలిగి వున్నా అందరూ పొందలేనిది,
ఆ అమ్మ మనసును తెలుసుకున్నవారు మాత్రమే పొందగలిగేది.
అమ్మా అని నువు పిలిచిన ప్ర తిసారీ ఆఅమ్మ పొందే ఆనందం చెప్పలేనిదైతే ,
ఆ అమ్మ నిన్ను పిలిచినపుడు నువు బదులిచ్చే విధానం చెప్పరానిది.
అమ్మ లేని నీ బ్రతుకు వ్యర్ధానికే వ్యర్ధం.
ఆ విషయం గ్రహిస్తేనే నీ జీవితానికి పరమార్ధం.
అమ్మ ప్రేమను కొలవగల కొలతల్లేవు.
అమ్మను వర్ణించగల కవితల్లేవు,
వర్ణించడం సాధ్యం కాదు,ఆ అమ్మను అర్ధంచేసుకోవడానికి నీ జన్మే చాలదు.
**********************************మన బరువును తన బాధ్యతగా మోసి
మన ప్రా ణానికి తన ప్రా ణాన్ని పణంగా పెట్టి
మన కోసం తన అనే భావాన్ని మరిచి,
మన విజయాన్నే తన విశ్వాసంగా
మన సంతోషాన్నే తన సంపదగా
మన ఆరోగ్యమే తన అందంగా భావించి
మన పుట్టుక నుండి తన మరణం వరకూ ఎల్లప్పుడూ
మన వెన్నంటి వుంటూ మన క్షేమాన్నిమాత్ర మే కోరుకునే
ఏకై క మహామూర్తి మన మాతృమూర్తి
అద్భుతం,అమోఘం,అఖంఢమై నది ఆ అమ్మ ప్రే మ
అటువంటి అమృతమూర్తి అనంతప్రే మను
అందుకున్నవారి అదృష్టం అపురూపం.
*******************************
మిలమిల మెరిసే మేను ....మేలిమి బంగారం తాను
సరిగాగలడా ఆ భాను కాదనగలడా ......ఆ అమ్మను
వేల విలువ గలది వెల కట్టలేనిది
ఊహకు అందనిది ఎక్కడా దొరకనిది
ఎన్నటికీ తరగనిది అవనికే ఆది
అన్నిటికంటే గొప్పది అట్టి ప్రే మ అమ్మది
*********************************
అమృత అంబుధి గలదు ...అమ్మ అను పదంలో
ఎక్కడ కనగలము అంతకన్నా అద్భుతం ఈ జగంలో
నిప్పులు కురిసే ఎండలో పువ్వుల వర్షం అమ్మ
తామసిని తొలగించగల వెన్నెల దీపం అమ్మ
తెలతెలవారు తెల్లని వేకువవేళలో తొలకరి తేనెల వాన అమ్మ
అమ్మలేనిదె లేదు ఈ అవని ఎన్నటికి విడువకు ఆ అమ్మని.
*************************************
నిండిన మేఘం కురిసిన వర్షంలో ... తడిసిన అనుభూతిని
ఎండనక వాననక కష్టిస్తూ......మెండై న ప్రే మను
గుండెల్లో దాచుకుని అమ్మ పంచిన .....ఆదరాన్నెలా మరిచిపోతావు?
బండలను సై తం కరిగించగలదు ....అమ్మ కరుణ శక్తి
నీ అండదండలే అమ్మ ....నే కోరుకొను ముక్తి ...!
ఇది ఎన్నటికీ మరువరాని సూక్తి..... !
ఆలోచన....
సాగిపోయే మేఘానికి తెలుసు
తను ఎప్పుడు నల్లగా మారాలో
పుష్పించే ప్రతి పువ్వుకు తెలుసు
తను ఎప్పుడు అందంగా వికసిస్తుందో
పుట్టే ప్రతి మనిషికి తెలుసు
తను ఎపుడో ఒక్కప్పుడు పోవాల్సిందేనని
జనించే ప్రతి ఆలోచనకు తెలియదు నిన్నెక్కడికి తీసుకెళ్తుందో ....
అందుకే మంచి ఆలోచల్ని కల్గివుండు ..... మిత్రమా......
2)ఉడికే ఉడుకు రక్తంతో
యుక్త వయస్సు ఆవేశంతో.....
నేనేమిటి ? ఈ బ్రతుకేమిటి ? అని...
నా ఆత్మను ప్రశ్నించినపుడు
ఏమి చేయాలి? మిత్రమా...??3)
ఎటో తెలియని ప్రయాణం.....
ఏమిటో ? ఈ జీవన గమ్యం
సంసార సాగరంలో పడి ఈదుతూ
ఏదరి చేరని ఈజీవనం నాకొద్దు
ఒక్కసారైన ఈశ్వర సేవ కోసం
పూవులా మారాలని వుంది .... ఓ దైవమా....!
అతిగా సంపాదించాలనే ఆశ...... దురాశకు దారి
బెదిరించాలనే ఆశ ..... చంపడానికి దారి
ఆట పట్టించాలనే ఆశ ..... అబద్ధానికి దారి
సత్యంగా ఉండాలనే ఆశ..... విజయానికి దారి
సత్యమే తన ప్రాణమై
ధర్మమే తన రక్షణయై
సేవయే తన ధ్యేయమై
నిస్వార్థం తన ఊపిరై
ప్రేమే తన లక్ష్యమై ...
జీవించే ప్రతి మనిషికీ
దైవమే ప్రతి అడుగడుగున.....
12.
___:మనిషి :____
ఎందుకే మనసా ఎక్కడికో పరిగెడతావు
ఏదీ మనది కాదని తెలిసి ,
ఎందుకే శరీరమా పరితపిస్తావు నాది నాది అని.....
నీవు జనించినప్పుడు తీసుకొచ్చింది ఏమీ లేదని తెలిసి
ఎందుకే సంసారమా పుట్టిస్తావు బంధాల్ని...
ఏ బంధము నాతో రాదని తెలిసి.....!!!
యుక్త వయస్సు
మలుపుతిప్పే యుక్త వయస్సులో
మరుపురాని ఎన్నో అనుభూతులు
ఏమిటా ....?
యుక్త వయస్సు అని అలోచిస్తే ఏదో తప్పు చేశానని మనస్సు
వేధించే ప్రశ్నల జల్లుల్లో....
తొలకరి చినుకుల్లా కురిసే
ఆనందాల హరి విల్లులు మరెన్నో.....!!!!!
అమ్మ...
.....
ఎలా నిర్వచించగలం అమ్మా అన్న పదాన్ని
నోటికి రాని మాటలతో , ఊహలకందని భావాలతో
ఎన్ని భాష లున్న ఏం లాభం?
పిల్లవాడి ఏడుపు వినగానే వాడికేం కావాలో
పసిగట్టే అమ్మ మనసు ముందు....
16
-----------జీవితం----------
ఎందుకో నాకీ జీవితం వింతగా కనిపిస్తుంది
మురిపించే మురిపాలతో
అందని ఆశయాలతో ,ఊరించే ఆశలతో తన పయనం మేఘంచాటు భానుడిలా సాగుతుంది
సూర్యాస్తమయం కోసం
ఎన్నటికి దాన్ని చేరే అవకాశాలున్నాయో అని ...??
ఎందుకో మళ్ళీ ఉదయించే సూర్యుడిలా
జన్మించాలని ఉంది కొత్త ఊహలతో..............
కవితలు
ఈ సృష్టిలో తీయనైనది అమ్మ ప్రేమయే...
అమ్మంటే అద్భుతం అమ్మంటే వివేకం
అపురూపం అమ్మరూపం
అమ్మపంచు తన రక్తం అమ్మ పంచు తన జీవం
అమ్మనిత్య నూతనం అమ్మ సత్య దర్శనం
అమ్మ ప్రేమకు ప్రతిరూపం
సర్వం అమ్మమయం
నవమాసాలు మోసేది అమ్మ నవ దశాబ్దాలు మోసేది భూమాత
మంచి చెడుల మమకారమిది
వికృతి నామ సంవత్సరం కావాలి శుభమది
జీవకోటి జనులందరికిది
సంతోశాలు ,ఉల్లాసాలు,ఉత్సాహాలు ఊతమీయగ ఊపిరీయగ
విస్వజగతికి విశ్వవిజయం
తెలుగువారికి అద్భుతంఇది అద్భుతం
ఈ ఉగాది యుగ యుగాల ఒడిలలో అలరారిన యుగాది
తేవాలి దేశానికి నవవసంతదీపికల సమ్మేళనమిది
సర్వజనహితం అదే నాఅభిమతం
క్రీస్తును ఆదరించిన గొప్పదనం ఇది హిందూదేశానికి సొంతం
విశ్వ వ్యాప్తం వేదాల సారం అద్భుతం గీతా సారం
జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన జనని ఇది
రెండు రూపములకు అసలైన అర్ధంచెప్పింది ఈ హైందవం
గురుశిష్యుల బంధాన్ని పురివిప్పి చెప్పిన ఘనత
భూపాళం వడ్డాణం కన్యాకుమారి కాళ్లురా తల్లికీ!!
హిందు మహాసముద్రంతాకి ధన్యం అవుతుంది
హిమాలయములు సిగల వెలసిన తెల్ల మల్లెలు తల్లికి
అందరిని ఆధరించే అహ్వానించే ఆకారంరా తల్లిది
అందుకే మనదేశం అందమైన అమ్మరా!!
శ్రీ జై జ్ఞాన సరస్వతి మాత
1ఒకే మాట ఒకే భాణం ఒకే భార్య అన్న రామున్ని కన్నది నాదేశం

1అమ్మ
ఆదికి పునాది అమ్మ
అందుకే నాంది ఆడజన్మ...
అపురూపంగా చూస్తాడు బ్రహ్మ
అమ్మ పాలు అమృతం
అమ్మ పాట మధురాతి మధురం
ఆది గురువు అమ్మ ఆది దైవం అమ్మ
రాజాది రాజైన వీరాధి వీరుడైన ఒక అమ్మకు కొడుకే
అమ్మంటే ఆనందం అమ్మంటే ఆలయం అమ్మంటే అద్భుతం అమ్మంటే వివేకం
అపురూపం అమ్మరూపం
అమ్మపంచు తన రక్తం అమ్మ పంచు తన జీవం
అమ్మ తెంచు పేగు బంధం
అమ్మ ఉంచు బిడ్డలపై అనంతమైన ప్రేమ బంధం
అమ్మకు ఎంతో రుణపడి ఉన్నాం మనం
అమ్మే మనకు ఆదర్శం అమ్మే మనకు మార్గ దర్శనం అమ్మనిత్య నూతనం అమ్మ సత్య దర్శనం
అమ్మ ప్రేమకు ప్రతిరూపం
అమ్మ సహనానికి నిలువెత్తు నిదర్శనం
అమ్మ ఒక శక్తి స్వరూపం
అమ్మ ఒక సత్యం
అమ్మ ఒక అనంతం సర్వం అమ్మమయం
నవమాసాలు మోసేది అమ్మ నవ దశాబ్దాలు మోసేది భూమాత
అమ్మను ప్రేమించు పూజించు
భూమాతను ప్రేమించినట్టే పూజించి నట్టే
2 యుగాది
ఆదికి పునాది ఉగాది
నవ వసంత దీపికల ఆశల పల్లకిది
షడ్ రుచుల సమ్మేళనమిది మంచి చెడుల మమకారమిది
వికృతి నామ సంవత్సరం కావాలి శుభమది
జీవకోటి జనులందరికిది
నవ చరిత్ర సృష్ఠించడానికి నవశకానికి నాంది కావాలి ఉగాది
తెలుగువారి గుండె నిండుగ నిండగ గడప గడపన పండగ
కోటి ఆశల కోటి జనులకు కోట్ల కాంతులు వెల్లువిరియగ సంతోశాలు ,ఉల్లాసాలు,ఉత్సాహాలు ఊతమీయగ ఊపిరీయగ
విస్వజగతికి విశ్వవిజయం
తెలుగువారికి అద్భుతంఇది అద్భుతం
నిరంతరం సంతోషమే పోటిపోటిన విజయమే
అందరికి కావాలి ఉగాది
మరువలేని మరిచిపోని మధురాతి మధురమైన జ్ఞాపకమిది ఈ ఉగాది యుగ యుగాల ఒడిలలో అలరారిన యుగాది
తేవాలి దేశానికి నవవసంతదీపికల సమ్మేళనమిది
నాదేశం..భారతదేశం

ఇదే హిందుత్వ అద్వైత సిద్ధాంతం
సకల మతాల సమ్మేళనం హిందుత్వం
సృష్ఠిపుట్టినపుడు పుట్టింది ఈ హైందవం
ఇది భార తీయ సంస్కృతికి చిహ్నం
విశ్వ జనహితం ఇదే వివేక సూత్రం
అల్లాను ఆధరించిన అద్భుత దయాగుణం ఇదిం హిందుత్వ అనికి సొంతం క్రీస్తును ఆదరించిన గొప్పదనం ఇది హిందూదేశానికి సొంతం
విశ్వ వ్యాప్తం వేదాల సారం అద్భుతం గీతా సారం
జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన జనని ఇది
రెండు రూపములకు అసలైన అర్ధంచెప్పింది ఈ హైందవం
గురుశిష్యుల బంధాన్ని పురివిప్పి చెప్పిన ఘనత
మన హిందూ దేశ చరిత
విశ్వంకన్నువిప్పనినాడే వేదంపలికిన ధరణి ఇది
ప్రపంచానికి జీవించడం తెలియని నాడే
సుసంపన్నమైన దేశంమన దేశంమనది
హిందుత్వం మతంకాదు భారత దేశం
హిందుత్వం భారత దేశ సంస్కృతి
హిందూ దేశంలో హిందువులు హిందువులం అని చెప్పుకోవడానిభయ పడుతున్న పరిస్థితి
ఇది ఓటు బాంకు రాజకీయాల దుస్థితి
3 మన భారత దేశం
వందనం అభి వందనం నా భరత మాతకు వందనం
విశ్వజగతికి విశ్వమానవ విజయ సూచికి వందనం
నిత్య నూతన సత్య దర్శన ముత్యమా అభి వందనం
దేవభూమికి పుణ్యభూమికి హిందుభూమికి వందనం
కాశ్మీరం శిరస్సురా!పంజాబు హర్యానలు కంఠాలురా!!
రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్ లు భుజ స్కంధాలురా!
గుజరాత్ అభయ హస్తం, ఈశాన్య రాష్ట్రాలు వామ హస్తం
కలకత్తా తీరప్రాంతం కొంగురా! భరతమాత కొంగురా!!
అమృత సరము కంఠహారము గాంధి నగరము గాజులు భూపాళం వడ్డాణం కన్యాకుమారి కాళ్లురా తల్లికీ!!
హిందు మహాసముద్రంతాకి ధన్యం అవుతుంది
హిమాలయములు సిగల వెలసిన తెల్ల మల్లెలు తల్లికి
కాశ్మీర కుంకుమా సింధూర తిలకంబురా!తల్లికి
జమ్ము... శ్రీనగరమ్ము రా....రెండుకళ్లు తల్లికి అందరిని ఆధరించే అహ్వానించే ఆకారంరా తల్లిది
అందుకే మనదేశం అందమైన అమ్మరా!!
ఇటువంటి దేశము ఈ భూప్రపంచములో లేదురా
ఈదేశంలోనే ఉన్నాం ఇది చాలురా!! ఈ జన్మకిది చాలురా!!
*పాటలు**శ్రీ జై జ్ఞాన సరస్వతి మాత
ప** విద్యల నిలయం సరస్వతి మంత్రం
బుద్ధుల నిలయం గాయత్రి యంత్రం
జగతిలో అందరూ నేర్చేది ఈ ఏక సూత్రం
అందుకే అయ్యింది విద్య పవిత్రం
"విద్యల"
చ*అలనాడు నేర్చాడువిద్యలను వేద వ్యాసుడు వేదాలనే వ్రాసాడు
వాల్మీకి నేర్చాడు విద్యలెన్నెన్నొ విచిత్రంగ రాసాడు రామాయణమునే
విశ్వామిత్రుడు నేర్చాడు విద్యలనే సృష్ఠికి ప్రతి సృష్ఠి నిర్మించిన ఈ విశ్వ విజేత
అందుకే కలియుగాన విద్యేర మిన్న
"విద్యల"
చ** గాయత్రి దివ్య ధాత్రి మా సరస్వతి
త్రిలోకమ్ములో నిలిచావు త్రిలోకమాతవై
అంధకారములో ఉన్న జీవులకు వెలుగునింపుటకు వెలసినవు కలియుగాన
కమ్మని కధలలా కరుణించి కాపాడావు
రమ్మని పిలిచి మమ్మాదుకున్నావు
యెల్లప్పుడు మీదీవెన మాకుంటే చాలు
ఓం శివ శంకరాయనమః .....
ప**ఓం నమః హ్ శివాయ ఓంనమః ...శివాయ
ఓంకార నాదేశ్వరా విభూదే నామేశ్వరా
శివ శంకరా శుభకర దినకర ప్రభాకరా
కాపాడరా పరమేశ్వర మహేశ్వరా
"ఓంకార"
చ**అన్ని నీవే ఆనందం నీవే అనంతం నీవే అఖండంనీవే
అందరికి అండ దండ నీవే
సుఖమూ కష్టమూ బాధా గాధ అన్నీ నీవే ఆనందేశ్వర
నీరూపం మధురం నీ నామం మధురం
నీ స్మరణ యే మధురాతి మధురమూ
"ఓంకార"
చ**ఎంత చూసిన తనివితీరనిది ఈదైవ రూపం
కన్నుల క్రాంతుల తోరణం మనశివ రూపం సుందరం
కరుణాల వాల కరుణాకరా మహిమలు చూపించే మహిమన్వితా
కాపాడరా వర దేవరా శంభోశంకరా ఇది నీకేఅర్పితమూ
"ఓంకార"
ఆచార్య దేవో భవ
ప**గురువా గురువా వందనాలయ్యా
గురువేలేని విద్యేలానయ్యా
ఆన్నింటిలో మమ్ము ముందునడిపిరీ
కన్నీటిని రానివ్వక కనికరించిరీ
మరపురాని గురుతై నారయ్యా
"గురువా"
చ** శిలలా ఉన్న మాబ్రతుకులనీ శిల్పాలుగ మీరు చెక్కినారయా
అలలా ఉన్నా మా ఉప్పెననీ అక్షరాలుగ మీరు అల్లినారయా
చిరునవ్వుల ధరహాసంలో ముంచేసినారయ్యా
చిరునవ్వుల పరిహాసంలో తేల్చేసినారయ్యా
మీరే మాకు సర్వస్వమూ
"గురువా"
చ** సుడిగుండంలో ఉన్నామంటూ
దరికి చేర్చి దారి చూపిరి
ప్రేమకు రూపం నీప్రతి రూపం అనిమాకు ఇప్పుడే అర్ధమైందిలే
స్నేహాల విలువలు చెప్పిన స్నేహ శీలులు మీరయ్యా
జ్ఞానాల అర్ధంచెప్పిన జ్ఞాన రూపులూ మీరయ్యా
తుదకూ మీరే సర్వస్వమూ
"గురువా"
అంకెలలో భారత దేశం

2రెండు రూపములకు(ఆడ,మగ)అసలైన అర్ధం చెప్పింది నాదేశం
3ముగ్గురు మూర్తుల దీవెన నాదేశం
4నాలుగు నాట్యాల సవ్వడి నాదేశం
5పంచ భూతాలతో నిండింది నాదేశం
6ఆరు ఱుతువుల ఆధరణ నా దేశం
7సప్త సరిగమల సుస్వర రాగాల అలలో చేసిన నాట్య విలాసం నాదేశం
8అష్టదిక్కులను అలికిన ఆనందం నాదేశం
9నవగ్రహాల అనుగ్రహంతో చేసిన విగ్రహం నాదేశం
10దశ అవతారాల దశ దిశలను చుట్టిన అల్ రౌండర్ నాదేశం
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం(21/02/2011 )సందర్భంగా ఆర్.జి.యు.కె.టి బాసర డైరెక్టర్ రాజేంద్రసాహు నుండి ఉపన్యాస పోటీల్లో బహుమతులు అందుకున్న విజేతలు...
తెలుగు న్యాయనిర్ణేతలు (ప్రక్కన )
బాసర ఆర్.జి.యు.కె.టి కేంద్రంగా జరిగిన
ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు పోటీపడి ఉపన్యసించారు.
బాసర ఆర్.జి.యు.కె.టి కేంద్రంగా జరిగిన
ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు పోటీపడి ఉపన్యసించారు.
-గురువు ----------------------------------------
ఒక మల్లెపూవు వికసించి సువాసనలను విరజిమ్ముతూ వుంటుంది.
అలాగే ఉపాధ్యాయులు ఈ నేలపై ఉద్బవించి, జ్ఞానాన్ని వెదజల్లుతూ
అప్పుడే వికసించిన విద్యార్థి జీవితానికి విద్యను నేర్పిస్తూ,
సక్రమైన క్రమశిక్షణను అలవరుస్తూ,
తల్లిదండ్రుల ముఖ్య పాత్రను పోసిస్తూ,
మనలో కమ్మనైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ,
సక్రమైన మార్గాన్ని చూపిస్తూ, మన దేశానికే
భావి భారత పౌరునిగా తీర్చిదిద్దుతూ వుంటారు.
అలాంటి కమ్మనైన, మృదువైన హృదయం కలవారే ఉపాధ్యాయులు
జీవితంలో ఎన్నో విషయాలు మరచిన, నీకు విద్య నేర్పిన గురువును మరవకు సోదరా!
---------------------- సైనికుడు -----------------------------
వందనం వందనం వీరజవానులకు ఇదే .....నా వందనం.
వందనం వందనం ఉగ్రవాదులను మట్టికరిపించిన
వీరజవానులకు ఇదే...... నా ప్రేమాభివందనం.
వందనం వందనం ఉగ్రవాదులను చీల్చడానికి....వీర నరసింహంలా
దూసుకు వచ్చిన వీర కమాండోలకు .....ఇదే నా శుభాభివందనం.
వందనం వందనం దేశ ప్రజల ప్రాణాలు కాపాడిన,
వీరజవానులకు ఇదే .....నా పాదాభి వందనం.
వందనం వందనం అహోరాత్రులు మేల్కొని దేశాన్ని రక్షిస్తున్న
వీరజవానులకు ఇదే ...నా హృదయపూర్వక వందనం.
-----------------సమయం ----------------------------------------
ఒక జీవిత ఖైదిని ప్రశ్నిస్తే, జీవితం విలువ తెలుస్తుంది.
పరీక్షలో తప్పిన విద్యార్థిని ప్రశ్నిస్తే, ఒక సంవత్సరం విలువ తెలుస్తుంది.
నెల జీతం చేసే వారిని ప్రశ్నిస్తే, నెల విలువ తెలుస్తుంది.
పొట్టకూటి కోసం పని చేసే వారిని ప్రశ్నిస్తే, ఒక రోజు విలువ తెలుస్తుంది.
ఉదయాన్నే లేచి పాలు అమ్మే వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక గంట విలువ తెలుస్తుంది.
రైలు మిస్సైన వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక నిమిషం విలువ తెలుస్తుంది.
యాక్షిడెంట్ జరిగిన వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక సెకను విలువ తెలుస్తుంది.
పరుగు పందెంలో రెండవ బహుమతి పొందిన వ్యక్తిని ప్రశ్నిస్తే,
ఒక మిల్లి సెకను విలువ తెలుస్తుంది.
ఎప్పుడైతే మానవుడు సమయానికి విలువిస్తాడో,
ఆ సమయమే అతనిని విలువైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.
------------చదువు -----------------------------------------------------------------
విద్యాలయం అనేది ఒక మహావృక్షం
ఈ వృక్షానికి ఉపాధ్యాయులు కొమ్మలాంటివారు
విద్యార్థులు మాత్రం ఆకులాంటి వారు
చదువు రాని వారు వాడిపోయిని ఆకులాంటివారు.
అందమైన బడి అనే కోవెలలో నాకు
చదువు కనిపిస్తుంది.
చదువు మనలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.
చదువు మనలో ధైర్యాన్ని సమకూరుస్తుంది.
చదువు మనలో క్రమ శిక్షణను అలవరుస్తుంది.
ఈ క్రమ శిక్షణనే మన పెద్దలను గౌరవిస్తుంది.
చదువు మనలో మానసిక ఆనందాన్ని కలుగజేస్తుంది.
--------పల్లెవాసులు ----------------------------------------------------
జేజేలు జేజేలు పల్లె వాసులకు జేజేలు
జేజేలు జేజేలు పల్లెచందమామలకు జేజేలు
నాటి యుగంలో తరిగిపోతున్న సంస్కృతిని కాపాడే పల్లె అతీతులకు జేజేలు
జేజేలు జేజేలు ప్రపంచానికే ఆహారాన్ని అందించే పల్లె అన్నదాత లకు జేజేలు
జేజేలు జేజేలు పల్లె అప్యాయతలకు, మమతానురాగాలకు ప్రతిరూపాలైన,
వారి మనస్తత్వాలకు జేజేలు ......
జేజేలు జేజేలు పల్లె మనస్తత్వాలకు
మంచు శిఖరాలకు జేజేలు
జేజేలు జేజేలు కష్టాలను, కన్నీళ్ళను ఓదార్పుగ భావించే వారి మనసత్వాలకు జేజేలు.
కావున పల్లెటూరికి వెళదాం
మన సంతోషాలను, ఆనందాలను,
పల్లే వాసులతో పంచుకుందాం
కమ్మనైన అనంతమైన, ఙాపకాలను మూటకట్టుకుందాం
జీవితాంతం ఆనందంతో జీవించుదాం!
============================
2)విజయం
అపజయాలకు భయపడితే పొందలేము విజయం
ధైర్యమనేది మన జతగా వుంటే మనదే విజయం
ప్రతిక్షణం మన సాధనలో వుంది విజయం
మన సాధనమే ఆయుధమై మనల్ని గెలిపిస్తుంది.
3)తెలుసుకో సోదరా
మంచితనాన్ని ప్రేరేపించుకో
అన్యాయాన్ని ఖండించుకో
వికారాల ముల్లును తొలగించుకో
చెడుపై విముక్తిని కలిగించుకో
జీవితంపై ఆసక్తిని పెంచుకో
కష్టాలను సుఖాలను మధురంగా
స్వీకరించుకో
మన మంచి భవిషత్తుకే అని తెలుసుకో సోదరా!
5)స్నేహం
మన జీవిత సింహాసానికి పట్టం కట్టించి
అందమైన భావాలపై అదుపు పెట్టించి
మన దివ్యగుణాల సవ్వడికి హారతి పట్టించి
మన ఆశయ దీక్షకు పదును పెట్టించి
మన వెన్ను తట్టి మన వెంట నిలిచేదె స్నేహం!
7)చిరునవ్వు
చిగురాకుల్లో చిరునవ్వు కనిపిస్తుంది
చిరునవ్వుల్లో ఉల్లాసం కనిపిస్తుంది
ఉల్లాసం మనిసిని ఉత్తేజ పరుస్తుంది
ఉత్తేజం మనిషికి ధైర్యాన్నిస్తుంది
ధైర్యం విజయాన్ని వరిస్తుంది
విజయంలో లక్ష్యం దాగి వుంటుంది
లక్ష్యం మార్గాన్ని సూచిస్తుంది
ఈ మార్గమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది
8)మన దేశం మన భారతదేశం
మువ్వర్ణాల దేశం మన భారతదేశం
మనకు జన్మనిచ్చిన దేశం మన భారతదేశం
ఎన్నో ఎన్నో భావాలతో కూడిన దేశం మన భారతదేశం
భిన్నత్వంలో ఏకత్వంగా పేరుగాంచిన దేశం మన భారతదేశం
కష్టాలకు కన్నీళ్ళకు ప్రతిరూపం మన భారతదేశం
ఎందరో సమర వీరులు పుట్టిన దేశం మన భారతదేశం
9)స్నేహం
కష్టాలకు కన్నీళ్ళకు ఓదార్పునిస్తుంది స్నేహం
స్నేహంకోసం నా ఆరాటము
ఈ స్నేహంలో కమ్మనైన సంతోషము
నా స్నేహితుల సంతోషమే నాకు ప్రతిరూపము
ఇక స్నేహమే నా జీవితము
అవును స్నేహము అనేది నా జీవితమే
జీవితంలో అన్నో విషయాలు మరిచినా!
ఈ స్నేహాన్ని మరువకు నా ప్రియమైన నేస్తమా!
10)గమ్యం
కోటి కష్టాలు ఎదురైన చేరుకోవాలి గమ్యం
గమ్యం కోసం నీవు చేయాలి పయనం
ఉంచకు ఆలోచనలకు మౌనం
మౌనం నీ చేత చేయిస్తుంది రణం
రణం అవుతుంది నీకు బారం
భారాన్ని చేసుకో దూరం
విజయం కోసం అలోచించు ప్రతిక్షణం
విజయం రాలేదని బాదపడకు ప్రతిదినం
నీ కృషిలోనే ఫలితం దాగి వుంటుంది ప్రియతమా!
ఆ తరువాతే నీ జీవితం అవుతుంది ఆనందమయం
12)చందమామ
చందమామ అందం
ముట్టుకుంటే మాసి పోయే చందనం
వర్ణించలేని అమోగం
మాటలకందని భావం
అంతులేని దూరం
మెరిసే మేలిమి బంగారం
కురిసెను పేదవాడికి ఆనందం
మనసును దోచే వైరాగ్యం
చిన్న పిల్లల మనసత్వం
అమ్మ గోరు ముద్దలకు ప్రతిరూపం
ఇదే ఇదే ఈ చందమామ ప్రత్యేకం
13)సమయం
జీవితంలో శాంతితో వున్నవారు
ఓర్పుతో సహనంతో జీవించేవారు
కమ్మనైన మాటలతో ఆకట్టుకొనేవారు
అందరితో కలసి మెలసి వున్నవారు
తొందరగా ఆవేశ పడనివారు
మంచి చెడును ఆలోచించి ముందడుగు వేసేవారు
సమయంతో పని చేసేవారు, ఏదైన సాధించగలుగుతారు
అని అంటోంది నా మనసు పలుమారు .
ఆకాశంలో మెరుపు మెరిసినా
కారుమెగాలు ఒకే సారి క్రమ్ముకున్న
ఈ నేలపై చురుగాలిలా వర్షం కురిసినా
రైతు గుండెలో మల్లె మొగ్గ వెలిసినా
జీవితం అనే రణ రంగం అగినా
సమయం మాత్రం ఆగునా
ఇలాంటి సమయాన్ని వృథా చేయడం మనకు
తగునా!
16)ప్రకృతి
ఆనందాన్ని కలిగించే కమ్మనైన నవ్వులతో
జీవితం సాగేది కష్ట సుఖాలతో
సముద్రం ప్రవహించేది ఆ అలలతో
ఆకాశం మెరిసేది ఇంద్రధనుస్సుతో
మనసు ఆనంద పడేది ఓ మంచిమాటతో
కష్టజీవి సంతోశ పడేది కష్ట ఫలితముతో
ఈ సృష్టి ఆనంద పడేది అందమైన ప్రకృతితోనే
కావున ఈ ప్రకృతిని కాపాడుదాం
ఈ అందమైన సృష్టికి ప్రాణం పోద్దాం!
17)ఇది ఎంత వరకు న్యాయం
కొమ్మల్లో రెమ్మల్లో జన్మించిన వారు
చీకటికి వెలుగుకు తేడా తెలియని వారు
ప్రేమానురాగాలు మరచిపోయిన వారు
తల్లి దండ్రుల ప్రేమను నోచుకొనని వారు
ఏ పాపం పుణ్యం ఎరుగని వారు
వారే అనాద పిల్లలు, ఇలాంటి పిల్లలకు జన్మనిచ్చి రోడ్డుపై వదిలి వెలతారే! ఇది ఎంత వరకు న్యాయమని నా మనసులోని ప్రతి భావన చెబుతుంది.
18)నాభావన
అందమైన చురుగాలి తనువంత తాకుతుంటే ...
నాలోని భావాలు పులకరిస్తుంటే,
జీవితంలో ఏదైన సాధించాలంటే
తగినంత కష్టపడాలని నా మనసంటే
కష్టపడి ప్రతి ఫలాన్ని పొందాలని నా బుద్ధి అంటుంటే
ఇక విజయాలే మీ సొంతుంటే ప్రపంచాన్నే జయించవచ్చని
నేనంటుంటే!.
19)కదలండి కదలండి:-
కదలండి కదలండి ఙ్ఞాన సముపార్జనకై కదలండి
అందరు సేవా భావంతో మెలగండి.
కులమత భేదాలకు అతీతులు కండి.
విద్య అనే పదంతో ముందుకు సాగండి.
మీ జీవితానికి అనువైన బాట ను వేసుకోండి
అపుడే మీ జీవితంసార్థకం అవుతుందండి.
ఒక మల్లెపూవు వికసించి సువాసనలను విరజిమ్ముతూ వుంటుంది.
అలాగే ఉపాధ్యాయులు ఈ నేలపై ఉద్బవించి, జ్ఞానాన్ని వెదజల్లుతూ
అప్పుడే వికసించిన విద్యార్థి జీవితానికి విద్యను నేర్పిస్తూ,
సక్రమైన క్రమశిక్షణను అలవరుస్తూ,
తల్లిదండ్రుల ముఖ్య పాత్రను పోసిస్తూ,
మనలో కమ్మనైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ,
సక్రమైన మార్గాన్ని చూపిస్తూ, మన దేశానికే
భావి భారత పౌరునిగా తీర్చిదిద్దుతూ వుంటారు.
అలాంటి కమ్మనైన, మృదువైన హృదయం కలవారే ఉపాధ్యాయులు
జీవితంలో ఎన్నో విషయాలు మరచిన, నీకు విద్య నేర్పిన గురువును మరవకు సోదరా!
---------------------- సైనికుడు -----------------------------
వందనం వందనం వీరజవానులకు ఇదే .....నా వందనం.
వందనం వందనం ఉగ్రవాదులను మట్టికరిపించిన
వీరజవానులకు ఇదే...... నా ప్రేమాభివందనం.
వందనం వందనం ఉగ్రవాదులను చీల్చడానికి....వీర నరసింహంలా
దూసుకు వచ్చిన వీర కమాండోలకు .....ఇదే నా శుభాభివందనం.
వందనం వందనం దేశ ప్రజల ప్రాణాలు కాపాడిన,
వీరజవానులకు ఇదే .....నా పాదాభి వందనం.
వందనం వందనం అహోరాత్రులు మేల్కొని దేశాన్ని రక్షిస్తున్న
వీరజవానులకు ఇదే ...నా హృదయపూర్వక వందనం.
-----------------సమయం ----------------------------------------
ఒక జీవిత ఖైదిని ప్రశ్నిస్తే, జీవితం విలువ తెలుస్తుంది.
పరీక్షలో తప్పిన విద్యార్థిని ప్రశ్నిస్తే, ఒక సంవత్సరం విలువ తెలుస్తుంది.
నెల జీతం చేసే వారిని ప్రశ్నిస్తే, నెల విలువ తెలుస్తుంది.
పొట్టకూటి కోసం పని చేసే వారిని ప్రశ్నిస్తే, ఒక రోజు విలువ తెలుస్తుంది.
ఉదయాన్నే లేచి పాలు అమ్మే వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక గంట విలువ తెలుస్తుంది.
రైలు మిస్సైన వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక నిమిషం విలువ తెలుస్తుంది.
యాక్షిడెంట్ జరిగిన వ్యక్తిని ప్రశ్నిస్తే, ఒక సెకను విలువ తెలుస్తుంది.
పరుగు పందెంలో రెండవ బహుమతి పొందిన వ్యక్తిని ప్రశ్నిస్తే,
ఒక మిల్లి సెకను విలువ తెలుస్తుంది.
ఎప్పుడైతే మానవుడు సమయానికి విలువిస్తాడో,
ఆ సమయమే అతనిని విలువైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.
------------చదువు -----------------------------------------------------------------
విద్యాలయం అనేది ఒక మహావృక్షం
ఈ వృక్షానికి ఉపాధ్యాయులు కొమ్మలాంటివారు
విద్యార్థులు మాత్రం ఆకులాంటి వారు
చదువు రాని వారు వాడిపోయిని ఆకులాంటివారు.
అందమైన బడి అనే కోవెలలో నాకు
చదువు కనిపిస్తుంది.
చదువు మనలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.
చదువు మనలో ధైర్యాన్ని సమకూరుస్తుంది.
చదువు మనలో క్రమ శిక్షణను అలవరుస్తుంది.
ఈ క్రమ శిక్షణనే మన పెద్దలను గౌరవిస్తుంది.
చదువు మనలో మానసిక ఆనందాన్ని కలుగజేస్తుంది.
--------పల్లెవాసులు ----------------------------------------------------
జేజేలు జేజేలు పల్లె వాసులకు జేజేలు
జేజేలు జేజేలు పల్లెచందమామలకు జేజేలు
నాటి యుగంలో తరిగిపోతున్న సంస్కృతిని కాపాడే పల్లె అతీతులకు జేజేలు
జేజేలు జేజేలు ప్రపంచానికే ఆహారాన్ని అందించే పల్లె అన్నదాత లకు జేజేలు
జేజేలు జేజేలు పల్లె అప్యాయతలకు, మమతానురాగాలకు ప్రతిరూపాలైన,
వారి మనస్తత్వాలకు జేజేలు ......
జేజేలు జేజేలు పల్లె మనస్తత్వాలకు
మంచు శిఖరాలకు జేజేలు
జేజేలు జేజేలు కష్టాలను, కన్నీళ్ళను ఓదార్పుగ భావించే వారి మనసత్వాలకు జేజేలు.
కావున పల్లెటూరికి వెళదాం
మన సంతోషాలను, ఆనందాలను,
పల్లే వాసులతో పంచుకుందాం
కమ్మనైన అనంతమైన, ఙాపకాలను మూటకట్టుకుందాం
జీవితాంతం ఆనందంతో జీవించుదాం!
============================
2)విజయం
అపజయాలకు భయపడితే పొందలేము విజయం
ధైర్యమనేది మన జతగా వుంటే మనదే విజయం
ప్రతిక్షణం మన సాధనలో వుంది విజయం
మన సాధనమే ఆయుధమై మనల్ని గెలిపిస్తుంది.
3)తెలుసుకో సోదరా
మంచితనాన్ని ప్రేరేపించుకో
అన్యాయాన్ని ఖండించుకో
వికారాల ముల్లును తొలగించుకో
చెడుపై విముక్తిని కలిగించుకో
జీవితంపై ఆసక్తిని పెంచుకో
కష్టాలను సుఖాలను మధురంగా
స్వీకరించుకో
మన మంచి భవిషత్తుకే అని తెలుసుకో సోదరా!
5)స్నేహం
మన జీవిత సింహాసానికి పట్టం కట్టించి
అందమైన భావాలపై అదుపు పెట్టించి
మన దివ్యగుణాల సవ్వడికి హారతి పట్టించి
మన ఆశయ దీక్షకు పదును పెట్టించి
మన వెన్ను తట్టి మన వెంట నిలిచేదె స్నేహం!
7)చిరునవ్వు
చిగురాకుల్లో చిరునవ్వు కనిపిస్తుంది
చిరునవ్వుల్లో ఉల్లాసం కనిపిస్తుంది
ఉల్లాసం మనిసిని ఉత్తేజ పరుస్తుంది
ఉత్తేజం మనిషికి ధైర్యాన్నిస్తుంది
ధైర్యం విజయాన్ని వరిస్తుంది
విజయంలో లక్ష్యం దాగి వుంటుంది
లక్ష్యం మార్గాన్ని సూచిస్తుంది
ఈ మార్గమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది
8)మన దేశం మన భారతదేశం
మువ్వర్ణాల దేశం మన భారతదేశం
మనకు జన్మనిచ్చిన దేశం మన భారతదేశం
ఎన్నో ఎన్నో భావాలతో కూడిన దేశం మన భారతదేశం
భిన్నత్వంలో ఏకత్వంగా పేరుగాంచిన దేశం మన భారతదేశం
కష్టాలకు కన్నీళ్ళకు ప్రతిరూపం మన భారతదేశం
ఎందరో సమర వీరులు పుట్టిన దేశం మన భారతదేశం
9)స్నేహం
కష్టాలకు కన్నీళ్ళకు ఓదార్పునిస్తుంది స్నేహం
స్నేహంకోసం నా ఆరాటము
ఈ స్నేహంలో కమ్మనైన సంతోషము
నా స్నేహితుల సంతోషమే నాకు ప్రతిరూపము
ఇక స్నేహమే నా జీవితము
అవును స్నేహము అనేది నా జీవితమే
జీవితంలో అన్నో విషయాలు మరిచినా!
ఈ స్నేహాన్ని మరువకు నా ప్రియమైన నేస్తమా!
10)గమ్యం
కోటి కష్టాలు ఎదురైన చేరుకోవాలి గమ్యం
గమ్యం కోసం నీవు చేయాలి పయనం
ఉంచకు ఆలోచనలకు మౌనం
మౌనం నీ చేత చేయిస్తుంది రణం
రణం అవుతుంది నీకు బారం
భారాన్ని చేసుకో దూరం
విజయం కోసం అలోచించు ప్రతిక్షణం
విజయం రాలేదని బాదపడకు ప్రతిదినం
నీ కృషిలోనే ఫలితం దాగి వుంటుంది ప్రియతమా!
ఆ తరువాతే నీ జీవితం అవుతుంది ఆనందమయం
12)చందమామ
చందమామ అందం
ముట్టుకుంటే మాసి పోయే చందనం
వర్ణించలేని అమోగం
మాటలకందని భావం
అంతులేని దూరం
మెరిసే మేలిమి బంగారం
కురిసెను పేదవాడికి ఆనందం
మనసును దోచే వైరాగ్యం
చిన్న పిల్లల మనసత్వం
అమ్మ గోరు ముద్దలకు ప్రతిరూపం
ఇదే ఇదే ఈ చందమామ ప్రత్యేకం
13)సమయం
జీవితంలో శాంతితో వున్నవారు
ఓర్పుతో సహనంతో జీవించేవారు
కమ్మనైన మాటలతో ఆకట్టుకొనేవారు
అందరితో కలసి మెలసి వున్నవారు
తొందరగా ఆవేశ పడనివారు
మంచి చెడును ఆలోచించి ముందడుగు వేసేవారు
సమయంతో పని చేసేవారు, ఏదైన సాధించగలుగుతారు
అని అంటోంది నా మనసు పలుమారు .
ఆకాశంలో మెరుపు మెరిసినా
కారుమెగాలు ఒకే సారి క్రమ్ముకున్న
ఈ నేలపై చురుగాలిలా వర్షం కురిసినా
రైతు గుండెలో మల్లె మొగ్గ వెలిసినా
జీవితం అనే రణ రంగం అగినా
సమయం మాత్రం ఆగునా
ఇలాంటి సమయాన్ని వృథా చేయడం మనకు
తగునా!
16)ప్రకృతి
ఆనందాన్ని కలిగించే కమ్మనైన నవ్వులతో
జీవితం సాగేది కష్ట సుఖాలతో
సముద్రం ప్రవహించేది ఆ అలలతో
ఆకాశం మెరిసేది ఇంద్రధనుస్సుతో
మనసు ఆనంద పడేది ఓ మంచిమాటతో
కష్టజీవి సంతోశ పడేది కష్ట ఫలితముతో
ఈ సృష్టి ఆనంద పడేది అందమైన ప్రకృతితోనే
కావున ఈ ప్రకృతిని కాపాడుదాం
ఈ అందమైన సృష్టికి ప్రాణం పోద్దాం!
17)ఇది ఎంత వరకు న్యాయం
కొమ్మల్లో రెమ్మల్లో జన్మించిన వారు
చీకటికి వెలుగుకు తేడా తెలియని వారు
ప్రేమానురాగాలు మరచిపోయిన వారు
తల్లి దండ్రుల ప్రేమను నోచుకొనని వారు
ఏ పాపం పుణ్యం ఎరుగని వారు
వారే అనాద పిల్లలు, ఇలాంటి పిల్లలకు జన్మనిచ్చి రోడ్డుపై వదిలి వెలతారే! ఇది ఎంత వరకు న్యాయమని నా మనసులోని ప్రతి భావన చెబుతుంది.
18)నాభావన
అందమైన చురుగాలి తనువంత తాకుతుంటే ...
నాలోని భావాలు పులకరిస్తుంటే,
జీవితంలో ఏదైన సాధించాలంటే
తగినంత కష్టపడాలని నా మనసంటే
కష్టపడి ప్రతి ఫలాన్ని పొందాలని నా బుద్ధి అంటుంటే
ఇక విజయాలే మీ సొంతుంటే ప్రపంచాన్నే జయించవచ్చని
నేనంటుంటే!.
19)కదలండి కదలండి:-
కదలండి కదలండి ఙ్ఞాన సముపార్జనకై కదలండి
అందరు సేవా భావంతో మెలగండి.
కులమత భేదాలకు అతీతులు కండి.
విద్య అనే పదంతో ముందుకు సాగండి.
మీ జీవితానికి అనువైన బాట ను వేసుకోండి
అపుడే మీ జీవితంసార్థకం అవుతుందండి.
అమ్మ కవితలు :
ఈ సృష్టిలో అపురూపమైనది వెలకట్టలేనిదే..అమ్మ ప్రేమ
అమ్మ .....
అమ్మ ఒడి చల్లనైనది
అమ్మ ప్రేమ కమ్మనైనది
అమ్మ రూపం అపురూపమైనది
అమ్మ దీవెనె దివ్యమైనది
అమ్మ మది స్వచ్చమైనది
అమ్మ ఆకాంక్ష ఎనలేనిది
అమ్మ రుణం తీర లేనిది.
2.అమ్మ ప్రేమ
ఈ భూమండలాన్ని కాగితంగా భావించి
ఈ భూమండలంలోని వృక్షాలను కలముగా ఊహించి
ఈ భూమండల సాగరంలోని నీటిని సిరగా భావించి,
అమ్మలోని ప్రేమ మాధుర్యాన్ని గూర్చి వ్రాసిన, వ్రాయలేని వర్ణించలేని
వెలకట్టలేని ప్రేమ మాధుర్యమే అమ్మ.
అమ్మ అంటే అలౌకిక ప్రేమ కేంద్రం
అమ్మ అంటే మధుర వాణి
అమ్మ అంటే మన పావన జీవన సంగీతానికి
స్వరం అమ్మే!
అమ్మ అంటే అమృతము
అమ్మ అంటే కమనీయ రాగం
అమ్మ అంటే గురి తప్పని శ్రీరాముని బాణం అమ్మే!
ఈ జగతికి మూలం అమ్మే!
మనం పీల్చే ప్రతి శ్వాసకు ప్రాణం అమ్మే!

అమ్మ .....
అమ్మ ఒడి చల్లనైనది
అమ్మ ప్రేమ కమ్మనైనది
అమ్మ రూపం అపురూపమైనది
అమ్మ దీవెనె దివ్యమైనది
అమ్మ మది స్వచ్చమైనది
అమ్మ ఆకాంక్ష ఎనలేనిది
అమ్మ రుణం తీర లేనిది.
2.అమ్మ ప్రేమ
ఈ భూమండలాన్ని కాగితంగా భావించి
ఈ భూమండలంలోని వృక్షాలను కలముగా ఊహించి
ఈ భూమండల సాగరంలోని నీటిని సిరగా భావించి,
అమ్మలోని ప్రేమ మాధుర్యాన్ని గూర్చి వ్రాసిన, వ్రాయలేని వర్ణించలేని
వెలకట్టలేని ప్రేమ మాధుర్యమే అమ్మ.
అమ్మ అంటే అలౌకిక ప్రేమ కేంద్రం
అమ్మ అంటే మధుర వాణి
అమ్మ అంటే మన పావన జీవన సంగీతానికి
స్వరం అమ్మే!
అమ్మ అంటే అమృతము
అమ్మ అంటే కమనీయ రాగం
అమ్మ అంటే గురి తప్పని శ్రీరాముని బాణం అమ్మే!
ఈ జగతికి మూలం అమ్మే!
మనం పీల్చే ప్రతి శ్వాసకు ప్రాణం అమ్మే!
No comments:
Post a Comment