Sunday, January 13, 2013

గ్రంథాలయము

గ్రంథాలయము

 ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశం గ్రంథాలయము. దీనిని ఆంగ్లమున లైబ్రరీ (Library) అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉదృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

జాతీయ గ్రంథాలయాలు

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జాతీయ గ్రంథాలయం[1] కోల్కతాలో వున్నది. దీనిని 1860 లో స్థాపించారు. 17, 18 వశతాబ్దంలో ప్రచురించిన పుస్తకాలు వున్నాయి. 24 లక్షలకు పైగా పుస్తకాలు (2010 నాటికి) వున్నాయి. వీటిని డిజిటల్ రూపంలోకి మార్చి అందరికి అందుబాటులోవుంచే పని జరుగుతున్నది. అలాగే భారత డిజిటల్ లైబ్రరీ [2] కూడా, వివిధ పుస్తకాలను కంప్యూటర్ లో భద్రపరచి అందరికి అందుబాటులోకి తెస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాలు

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ [3] 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 బిడిసి (పుస్తక జమ కేంద్రం ‌ ‌‌Book Deposit Centers)గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ[4]ప్రాజెక్టు లో భాగంగా, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.

భారత డిజిటల్ లైబ్రరీ


భారత డిజిటల్ లైబ్రరీ ముఖపత్రం
భారత డిజిటల్ లైబ్రరీ (Digital Library of India) [1] [2] [3] ప్రాజెక్టులో మనదేశములోని వివిధ భాషలలోని పుస్తకాలను డిజిటల్ రూపంలోకి మార్చి అంతర్జాలం ద్వారా ఎవరైనా చదివే లేక పొందే ఏర్పాటు కలది. ఈ ప్రాజెక్టు సార్పత్రిక డిజిటల్ లైబ్రరీలో భాగంగా చేపట్టబడింది. భారత డిజిటల్ లైబ్రరీప్రాజెక్టు లో భాగంగా, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను[4] స్కానింగు చేసి అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం తరపున 14,343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.జులై 2012 నాటికే మొత్తం భాగస్వామ్యాలద్వారా 23361 పైగా తెలుగు పుస్తకాలు 4,480,653 మొత్తం పేజీలతో డిజిటల్ రూపంలో (బొమ్మ) అందుబాటులో వున్నాయి. అన్ని భాషలలో కలిపి 3,47,462 పుస్తకాలు, 123,390,315 మొత్తం పేజీలు డిజిటైజ్ చేయబడ్డాయి. [5]. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో డిజిటల్ లైబ్రరీ ఫథకాలకు 70కోట్ల రూపాయల ప్రణాళిక తయారుచేయబడింది. [6]

చదువుటకు సూచనలు

వెబ్సైట్ లో చదువుటకు టిఫ్ (TIFF) బొమ్మలు చూపెట్టగలిగే ఉపకరణము, మీ విహరిణిలో స్థాపించుకోవాలి. ఇంటర్నెట్ ఎక్సోప్లోరర్ వాడితే ఆల్టెర్నాటిఫ్(alternatiff) వాడాలి. లినక్స్ ఫైర్‌ఫాక్స్ వాడుకరులు, మొజ్‌ప్లగ్గర్(mozplugger) పొడిగింతను స్థాపించుకోవాలి. ఫైర్పాక్స్ (3.6.3)లో ఒక పేజి చూపించే లింకు మాత్రమే పనిచేస్తున్నది. పేజీలు తిప్పడానికి, క్రింద వున్న వచ్చే ప్రేమ్లో క్రిందదాక పోవాలి( పేజీ డౌన్ చేయాలి).

అతి చిన్న పుస్తకాల లైబ్రరీ...ఫోటోలు

అందరమూ అతి చిన్న పుస్తకాన్ని చూసే ఉంటాము. కానీ అలాంటి చిన్న పుస్తకాల లైబ్రరీ ఉన్నదంటే నమ్మకం కలగటంలేదు. కానీ ఉన్నదన్నదే నిజం. ఫ్రాన్స్ దేశానికి చెందిన జాజ్ సెఫ్ టరీ అనే ఆయన 1969 నుండి మినీ పుస్తకాలను సేకరిస్తూ 4500 చిన్న పుస్తకాలతో ఒక లైబ్రరీ మొదలుపెట్టేరు. ఆయన దగ్గరున్న చిన్న పుస్తకాలలోనే అతి చిన్న పుస్తకం సైజు 0.11 x 0.12 ఇంచ్ లు. జెనెరల్ నాలెడ్జె,స్పోర్ట్స్,రాజకీయం, సంగీతం మరియూ మతం కు చెందిన పుస్తకాలు ఉన్నాయట.











 

 

 

No comments:

Post a Comment