ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు మహాసభలు [1]మొదటిసారిగా హైదరాబాదులో 1975 నిర్వహించారు. ఆ సందర్భంగా ఎందరో తెలుగు ప్రముఖుల్ని సన్మానించారు. కొన్ని ముఖ్యమైన పుస్తకాల్ని ప్రచురించారు. ఆనాటి సభల జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది.- 2012 నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు- తిరుపతి, డిసెంబరు 27,28 మరియు29, 2012
- 1990 మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు - మారిషస్
- 1981 రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు - కౌలాలంపూర్, మలేషియా
- 1975 మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు - హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్
- http://telugubhasha.in/telugubasha/index.php
- http://www.worldteluguconference.com/meeting-history.html
మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు (1975)
- ప్రధాన వ్యాసం: మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు
రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు (1981)
- ప్రధాన వ్యాసం: రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు (1990)
మారిషస్ లోమూడవ ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ 8వ తేదీ నుండి మూడు రోజుల పాటు వైభవంగా జరిగాయి. మారిషస్ ప్రభుత్వ సహకారంతో అక్కడి తెలుగు కల్చరల్ ట్రస్టు మరియు తెలుగు విశ్వవిద్యాలయం కలిసి, ఇందిరా గాంధీ సాంస్కృతిక కేంద్రంలో వీటిని నిర్వహించారు.[2]నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (2012)
- ప్రధాన వ్యాసం: నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు
చిహ్నం
ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం తెలుగుజాతిని వివిధ కొణాలలో ఆవిష్కరిస్తున్నది. ఇందులోని రెండు సర్పాలు తెలుగువారి విజ్నానానికి సంకేతాలు. నౌక శాతవాహన కాలంలోనే ఆంధ్రుల నౌకా నైపుణ్యానికి చిహ్నం. పూర్ణకుంభం బౌద్ధయుగంలోను మరియు ఓరుగల్లు ద్వారం కాకతీయయుగంలోను తెలుగువారి ప్రాభవాన్ని తెలియజేస్తుంది. దీనిలోని హంస క్షీరనీర న్యాయానికి, భారతీయుల ఆత్మతత్త్వానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, రాజధాని హైదరాబాదు నగరం భారతదేశపు రేఖాచిత్రంలో నిక్షిప్తమై తెలుగుజాతి మనుగడను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశపు త్రిభాషా సూత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీషు లిపులలో అక్షరరూపం దాల్చింది.
తెలుగు మహాసభలు
తెలుగు మహాసభలు యధాతథం, వేదిక మార్పు
హైదరాబాద్:
ప్రపంచ తెలుగు మహాసభలను యధాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తిరుపతిలో భారీ వర్షాలు పడడంతో సభలు వాయిదా వడే అవకాశాలున్నట్లు వార్తలు
వచ్చాయి. దీంతో ప్రపంచ తెలుగు మహాసభలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి గురువారం సచావాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న విధంగా మహాసభలు జరగాలని, అవసరమైతే వేదికను
మార్చాలని ...
No comments:
Post a Comment